మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

by Kodari Anjali |   (  Updated:2026-04-12 10:35:32  IST  )

నేడు ఇంటర్ ఫలితాలు విడుదలవ్వగా.. ఫెయిల్ అయ్యననే మనస్తాపంతో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
X

దిశ, ఉట్నూర్: ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లికి చెందిన జిల్లపెల్లి బక్కన్న, బుచ్చవ్వ దంపతుల కుమార్తె సౌజన్య(17) ఉట్నూర్‌లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల చేయగా ఆ ఫలితాలలో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ సమయంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సౌజన్యను ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే సౌజన్య ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story