- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగడి.. ఆగమాగం
వారానికి రెండు దపాలు వార సంత జరుగుతుంది, ప్రతి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సంత జరుగుతూనే ఉంటుంది.

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార సంత ఉమ్మడిఆదిలాబాద్ ఖానాపూర్ పాత తాలూకా గ్రామపంచాయతీ ఉన్న దశలో ఖానాపూర్ పట్టణంలోని మొగల్ పూర్ కాలనిలో అంగడి బజార్ వారానికి రెండు సార్లు బుధవారం ,ఆదివారం లో వార సంత కొనసాగుతువస్తుంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న వారానికి రెండు సార్లుజరుగుతున్న వారసంతకు ఖానాపూర్, కడం,మామడ, పెంబి,మండలాల్లో నుంచి కాకుండ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలాల్లో నుండి రైతులు పండించిన కూరగాయలు రైతులు,వ్యాపారస్తులు వార సంతకు తీసుకవచ్చి విక్రయాలు జరుపుతుంటారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ కావడంతో రోజు రోజు జనాభా పెరుగుతూ వ్యాపారస్తులకు,రైతులకు పండించిన పంటలను విక్రయాలు జరుపుటకోసం అంగడి బజార్ స్థలం సరిపోవడంలేదని ఖానాపూర్ పట్టణంలో సమీకృత మార్కెట్ ఏర్పాటు కోసం పట్టణంలో ని పద్మావతి నగర్ కాలని లోని తహిసిల్దార్ బంగ్లా స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు కోసం 390 .లక్షల వ్యయం తో టి.యు.ఫ్, ఐ.డి.సి. నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
2022 సంవత్సరం లో ప్రస్తుతం తాజా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్,స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ సమీకృత మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. కొంతమేరకు పనులు జరగగ మధ్యలో ఆ పనులు నిలిసిపోయి.ఆగిపోయిన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు స్థానిక ఎమ్మెల్యే వెడమ బోజ్జు పటేల్ చొరవతో పనులు కొంతమేరకు జరిగిన నిధులు లేక సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రస్తుతం నిలిసిపోయి.నియోజకవర్గం కేంద్రం అయి వుండి ఖానాపూర్ మున్సిపాలిటీలో మూడు సంవత్సరాలు అయిన సమీకృత మార్కెట్ నిర్మాణం జరుగపోవడతో మార్కెట్ నిర్మాణం జరుగేనా అనే విమర్శలు వెళువెత్తున్నాయి.నిలిసిపోయిన సమీకృత మార్కెట్ స్థలంలో పందులకు నివాస నిలయంగా, చెత్త డాంప్ గా మారింది అని స్థానికులు చెబుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పట్టేల్ చొరవచూపి సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని పట్టణ వాసులు,మండల వాసులు కొరుతున్నారు.
రోడ్డు పైనే వార సంత - ఉద్యోగులకు వాహనదారులకు ఇక్కట్లు
ఖానాపూర్ పట్టణంలోని మొగల్ పూర్ లో ప్రాంతంలో ని అంగడి బజారు లోను ఆది, బుధవారం లలో వార సంత ఖానాపూర్ పాత తాలూకా ఉన్న కాలం నుండి వారానికి రెండు సార్లు అంగడి బజారు కొనసాగుతూ వస్తుంది. కరోన సమయం నుండి అంగడి బజారులో కాకుండ బస్టాండ్ నుండి అంగడి బజారు వరకు రోడ్డు పై వార సంత కొనసాగుతూ వస్తుంది. అంగడి బజార్ కు వెళ్లే దారిలో ప్రభుత్వ కార్యాలయాలు వుండంతో తమ కార్యాలయంకు వెళ్ళడానికి ప్రభుత్వ ఉద్యోగులు ,వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పాత బస్టాండ్ నుండి అటవీశాఖ కార్యాలయం, తహిసిల్దార్ కార్యాలయం,స్టేట్ బ్యాంక్, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ కలవు. ఆది, బుధవారం లలో జరిగే వారానికి రెండు సార్లు వార సంత ఇరుకైనా రోడ్డు పై కొనసాగడంతో తమ కార్యాలయం లకు వెళ్లే ఉద్యోగులు తమ విధులకు ఆటంకాలు జరుగుతున్నట్లు, సరి యగు సమయానికి హాజరు కాలేకపోతునట్లు ఉద్యోగాలు తెలుపరు .రోడ్డుపై వాహనాలు,108 వాహనాలలో రోగులు ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారు అని, సమయానికి వైద్యం అందటం లేదని రోగులు వాపోతున్నారు. రోడ్డు పై వార సంత జరుకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఉద్యోగస్తులు వాహనాదారులు ,ప్రజలు కోరుతున్నారు
మూలానపడ్డ మరుగుదొడ్లు
వారానికి రెండు దపాలు వార సంత జరుగుతుంది, ప్రతి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సంత జరుగుతూనే ఉంటుంది.మార్కెట్ కు వచ్చిన మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడ్డతున్న పట్టించుకొనే వారూలేరు. వేసవిలో తాగునీరు కూడ కరువే, మార్కెట్ కు వచ్చిన మహిళల కోసం పోలీస్ స్టేషన్ ముందు గ్రీన్ వర్కర్ సొసైటీ ద్వారా సోషల్ సర్వీస్ విభాగం గా మరుగుదొడ్లు ఏర్పాటు చేసిన వాటిని పట్టించుకునే వారు లేక ఆ మరుగుదొడ్లు మూలనా పడ్డాయి.మార్కెట్ వేలంలో లక్షల రూపాయలు మున్సిపాలిటీ కి వచ్చిన, మున్సిపల్ అధికారులు కనీసం మరుగుదొడ్లు పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు.






