మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలకు అవమానం

by Taduka Kalyani |

మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయం వెనకాల పడేసి ఉండడం కలకలం రేపుతోంది.

మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలకు అవమానం
X

దిశ, భీమిని: మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయం వెనకాల పడేసి ఉండడం కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలొని ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యాలయం వెనకాల జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలు కార్యాలయం వెనుక కిటికీ కింద గోడ పక్కన పడేసి ఉండడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యకు పాల్పడింది కార్యాలయం అధికారులా, లేక ప్రైవేటు వ్యక్తుల పనా అనే సందేహాలు స్థానిక ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. అధికారుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కార్యాలయాలలో భద్రంగా ఉంచాల్సిన ఫోటోలను బయట పడేయడం పై అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్ముడి చిత్రపటాన్ని, భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మహానుభావుని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయం వెనకాల పడేసి ఉండడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజలు విచారణ జరిపి దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story