ప్రయోజనం కోల్పోయిన పారిశ్రామిక వాడ

by Batti.Sumithra |

ఏజెన్సీ కేంద్రంగా గిరిజన నిరుద్యోగ యువతకు పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ అభివృద్దికి నోచుకోవడం లేదు.

ప్రయోజనం కోల్పోయిన పారిశ్రామిక వాడ
X

దిశ, ఉట్నూర్ : ఏజెన్సీ కేంద్రంగా గిరిజన నిరుద్యోగ యువతకు పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ అభివృద్దికి నోచుకోవడం లేదు. ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో 1998లో లక్షలాధి రూపాయలతో మండలంలోని ఎక్స్ రోడ్డు సమీపంలోని నిర్మించినప్పటికి అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన యువతకు ప్రయోజనం లేకుండా ఆమడ దూరంలో ఉండిపోయింది. గిరిజన యువతకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో లక్ష్యం నిరుగారుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపించాలని అప్పటి పీఓ ఆదేశాల మేరకు పారిశ్రామిక సముదాయాల భవనాలు 14 షెడ్లు ఏర్పాటు చేశారు. గిరిజనులకు అప్పట్లో పాలిథిన్ బ్యాగుల తయారి, నోట్ బుక్స్ తయారి, ట్రంక్ బాక్సులు, బ్రెడ్ తయారీ, పప్పుల తయారి, ఆయిల్ మిల్, పసుపు, మిర్చి తయారీ, ఇంజనీరింగ్ పరిశ్రమలను భవనాలలో ఏర్పాటు చేశారు.

ప్రారంభంలో అధికారులు చూపిన ఉత్సాహం ఉపాధికి మరింత ఆవకాశాలు కల్పించకపోవడం, పరిశ్రమల్లో తయారి చేసిన ఉత్పత్తుల సరుకులను మార్కెటింగ్ లేకపోవడం, కరెంట్ బిల్లులు సైతం పెరగడంతో నిర్వహకులకు అప్పులు మరింత పెరిగిపోవడంతో ఈ భవనాలు మూలన పడ్డాయి. 2001 పారిశ్రామిక వాడను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్న చేశారు. అప్పుడు ప్రజాప్రతినిధుల సహాయంతో మరోసారి పరిశ్రామిక వాడను పునరుద్దరించాలని పూనుకున్న.. కొన్ని నెలల పాటు సక్రమంగా నడిచినప్పటికి కొన్ని కారణాలతో పరిశ్రమలు మూలనపడ్డాయి. గిరిజనులకు స్వయం ఉపాధిలో రాణించేందుకు ఏర్పాటు చేసిన ఈ భవనాలు ఎంతో ఆశయంతో ఏర్పాటు చేసినప్పటికీ ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కళ తప్పాయి. ప్రస్తుతం ఈ భవనంలో ఆదివాసీ ఆహారం, ప్రజా మిత్ర రైతు సహకార సంస్థ ఫర్టిలైజర్, ఓ గిరిజన సంఘానికి భవనాలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. కొన్ని భవనాలు నిరుపయోగంగా మారాయి. మరికొన్ని భవనాలు శిథిలవ్యస్థకు చేరుకున్నాయి. లక్షల రూపాయలతో నిర్మించిన ఈ పరిశ్రమల వాడ నిరుపయోగంగ మారడంతో ప్రభుత్వ సొమ్ము వృధా అయిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

పిచ్చిమొక్కల మధ్య భవనాలు..

ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ లోని పలు భవనాలు పిచ్చి మొక్కల మధ్య ఉన్నాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉత్సవ విగ్రహంల మిగిలాయి. గిరిజన యువతను పరిశ్రమల్లో ప్రోత్సహించేందుకు అధికారులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోని ఈ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ను తిరిగి పునప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

వినియోగంలోకి తీసుకరావాలి : పుర్క బాపురావ్, తుడుందెబ్బ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎక్స్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకురావాలి. అక్కడ తయారు చేసే వస్తువులను ఐటీడీఏ, జీసీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్థికాభివృద్ది సాధించే దిశగా కృషి చేయాలి.

Next Story