ధ‌ర్నా పేరుతో.. బీజేపీ నేతల డ్రామాలు..!

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్ : మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయ‌కులు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి.. ధ‌ర్నా చేయ‌డం సిగ్గు చేటని కాంగ్రెస్ నాయ‌కులు డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి

ధ‌ర్నా పేరుతో.. బీజేపీ నేతల డ్రామాలు..!
X

దిశ, ఆదిలాబాద్ : మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయ‌కులు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి.. ధ‌ర్నా చేయ‌డం సిగ్గు చేటని కాంగ్రెస్ నాయ‌కులు డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి మండిపడ్డారు. మంగ‌ళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు పూర్తిచేయ‌లేద‌ని ధ‌ర్నా చేసిన బీజేపీ నాయ‌కులు ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు ఏమ‌య్యాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా..ఇక్కడి ఎంపీ,ఎమ్మెల్యేలు సీసీఐతో మాట్లాడి ఎందుకు రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలేద‌ని అన్నారు. తేమ శాతంతో పంట అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు ప‌డుతుంటే ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జా సంక్షేమం కోసం ప‌నిచేస్తున్న ప్ర‌భ‌త్వంపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు స‌రికావ‌న్నారు. మొన్న‌టి బీఆర్ఎస్ నాయ‌కులు ఎంపీ ఇంటి ముట్ట‌డి స‌రికాద‌న్నారు. మ‌రి ఎమ్మెల్యే ఇంటి ముట్ట‌డి ఎందుకు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దీంతో జోగు రామ‌న్న పాయ‌ల్ శంక‌ర్ ఒక్క‌టే అన్నది రుజువవుతంద‌న్నారు. జూబ్లిహిల్స్ ఫ‌లితాలతో బీఆర్ఎస్ బీజేపీల బ‌ల‌మెంతో తేలిపోతుంద‌న్నారు. ఈ స‌మావేశంలో నాయ‌కులు మునిగెల న‌ర్సింగ్, లోక ప్ర‌వీణ్ రెడ్డి, శ్రీ‌లేఖ‌, ప్రశాంత్ పాల్గొన్నారు.

Next Story