- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి పనికి తక్కువ.. ఫోటో క్యాపర్చర్ కే టైమ్ ఎక్కువ..!
ఉపాధి హామీ పని చేయడం కంటే ఫోటో క్యాప్చర్ కోసం ఎక్కువ టైమ్ వేచి ఉండాల్సి వస్తున్నదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, కుబీర్ : ఉపాధి హామీ పని చేయడం కంటే ఫోటో క్యాప్చర్ కోసం ఎక్కువ టైమ్ వేచి ఉండాల్సి వస్తున్నదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. మండలంలో 11 వేలకు వరకు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. కొన్నిరోజులుగా మండలంలో రోజుకు సగటున 2500 మంది నుంచి 3500 వరకు కూలీలు మాత్రమే పనులకు వెళ్తున్నట్లు సమాచారం. ఫీల్డ్ లో పనిచేయడం తక్కువైందని, ఉదయం మధ్యాహ్నం రెండు సార్లు ఫోటోలు దిగడానికి సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్ లపై ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల పార్డి( కే )లో పనికి వెళ్ళని వాళ్లకు సైతం ఫోటో క్యాప్చర్ తీసి హాజరు వేస్తున్నట్లు, కొందరికి డబ్బులు తక్కువగా వేయిస్తానని బెదిరిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల పనులకు వెళ్ళని వాళ్లకు, వృద్ధులకు, స్థానికంగా ఉండని వాళ్లకు సైతం హాజరు వేస్తున్నట్లు విమర్శలున్నాయి. వారాలు గడుస్తున్నా డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. దీంతో కూలీలు వ్యవసాయ ఇతరాత్ర పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికారులు డబ్బులు విడుదల అయ్యేలా చూడాలని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






