- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవిలో కడెం సాగునీరు గోదావరిలోకి..!
నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు నుంచి వేసవిలో ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదిలిన ఘటన చోటు చేసుకుంది. అధికారులు మాత్రం రాబోయే వర్షాకాలం కోసం ప్రాజెక్టు వరద గేట్లు పరిశీలన కోసం, కెనాల్ మర్మతులకోసం గేట్లు ఎత్తినట్లు అధికారులు చెబుతున్నారు.

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు నుంచి వేసవిలో ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదిలిన ఘటన చోటు చేసుకుంది. అధికారులు మాత్రం రాబోయే వర్షాకాలం కోసం ప్రాజెక్టు వరద గేట్లు పరిశీలన కోసం, కెనాల్ మర్మతులకోసం గేట్లు ఎత్తినట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి లో ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి నీరు వదులటం ఏంటి..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాసంగి పంట కాలం ప్రారంభమయ్యే నాటికి ప్రాజె క్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 700అడుగులు నిల్వ ఉంచారు. రెండో పంటకు పూర్తిస్థాయి ఆయకట్టు కాకుండా 28వ ఉపకాలువ వరకు 25వేల ఎకరాలకు మాత్రమే కడెం నుంచి నీటిని విడుదల చేశారు. కుడి కాలువకునీటిని విడుదల చేస్తూ కడెం పరిధిలోని చెరువులను నింపుతున్నారు. నీటిమట్టం నేడు 682.7 అడుగుల వద్ద ఉంది. ప్రధాన కాలువ బెడ్ లెవల్ కన్నా ఏడు అడుగుల మేర నీటిమట్టం ఎక్కువగా ఉంది. కడెం ప్రాజెక్టు కాలువలు మరమ్మతులు చేయడం కోసం ప్రాజెక్టు లో నీటి స్టోరేజ్ ఎక్కువ ఉండంతో పనులు చేయరాదని, అంతే కాకుండా గేట్ల పరిశీలన చేయడం కోసం అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను కొంతమేర ఎత్తి 500 నుంచి 600 వరకు క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరికి వదులుతున్నారు.






