- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ఇంట్లో మద్యం, డబ్బుకు ఓట్లు అమ్మం అని ఫ్లెక్సీ ఏర్పాటు
మున్సిపల్ కార్పొరేషన్ లో విజయాన్ని సాధించేందుకు అభ్యర్థులు గెలుపు కోసం తమదైన శైలిలో ఎన్నికల ప్రచార జోరును పెంచుతున్నారు.

దిశ, మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ లో విజయాన్ని సాధించేందుకు అభ్యర్థులు గెలుపు కోసం తమదైన శైలిలో ఎన్నికల ప్రచార జోరును పెంచుతున్నారు. ఓటుకు మద్యం, డబ్బు పంపిణీ చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థులు పంచె మద్యం డబ్బుకు అమ్ముడు పోమంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో ఫ్లెక్సీ పెట్టి ఓటు విలువను తెలుపుతున్నాడు. తన ఇంటి గోడ పై మా ఇంట్లో ఓట్లు మద్యం, డబ్బుకు అమ్మమంటూ ఫ్లెక్సీ అంటించడం అందరిని ఆశ్చర్యంలో పడెస్తోంది. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 16 వ డివిజన్ పరిధిలోని ముల్కల గ్రామానికి చెందిన కొత్తపల్లి. శ్రీరామ్ మూర్తి మార్పు కొరకు నా అడుగు అంటూ నా ఇంటిలో మద్యానికి, కానీ డబ్బుకి కానీ మా ఓట్లు అమ్మబడవు నాకు దమ్ముంది డబ్బు మద్యం తీసుకోకుండా ఓటు వేయడానికి మరి మీకు..? అంటూ వినూత్న రీతిలో ఓటు విలువను తెలియజేయడానికి చేసిన ఫ్లెక్సీ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.






