- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటున్న ఇనుప టాకీ కుర్చీలు..
ఓ హోటల్ యజమాని కొత్త ఐడియాకు ప్రజలు ఆశ్చర్యపోతూ.. ఐడియా అదిరిందంటూ పొగిడేస్తున్నారు.

X
దిశ, కుబీర్: మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో ఉన్న, ఒక హోటల్ యజమాని ఏర్పాటు చేసిన ఇనుపటాకి కుర్చీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. . వేస్టును బెస్ట్‌గా మార్చి ఎంత బరువున్నా కూర్చుంటే ఇరిగేది లేదు అన్నట్టుగా తయారు చేయించాడు. మార్కెట్‌లో ఆయిల్‌తో వచ్చే ఇనుపటాకీలను కొనుగోలు చేశాడు. వాటికి మనిషి కూర్చునే విధంగా వెల్డింగ్ షాప్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసి ప్లైవుడ్ చెక్కను వేయించాడు. కత్తిరించిన ఇనుప రేకు కుచ్చుకోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బీడింగ్ ఏర్పాటు చేశాడు. ఇనుపటాకీకి రెడ్ కలర్ వేయించాడు. ప్రస్తుతం ఆ హోటల్‌కు వచ్చిన కస్టమర్లను ఈ కుర్చీలు ఆకట్టుకుంటున్నాయి. చూసిన జనాలంతా ఐడియా అదిరింది అంటూ హోటల్ యజమానిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Next Story






