నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా

by Ratna Kumari |

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే చ‌ర్య‌లు త‌ప్పవ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా
X

దిశ, లక్ష్మణచంద : మండలంలోని పార్ పల్లి గ్రామంలో గోదావరి పరివవాక ప్రాంతం నుంచి ఇసుకకు మండల రెవెన్యూ అధికారుల ద్వారా ఎటువంటి అనుమతి లేకుండా దర్జాగా నాలుగైదు ట్రాక్టర్లు ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తూ గ్రామంలో గ్రామ శివారులో డంపులు గా నిల్వచేసి ప్రజల ఆస్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.అధికారులు ఈ సందర్భంగా శ్రద్ధ చూపకపోవడం వలన జనాలు అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై స్థానిక రెవిన్యూ అధికారులు స్పందించి అక్రమ ఇసుక అరికట్టేందుకు నియమ నిబంధనలతో కూడిన పకడ్బందీ ఆదేశాలు అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత మండల రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇసుక మాఫియా మరి రెచ్చిపోతూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకొని ఇసుక మాఫియా దళారుల ఆగడాలను అరికట్టవలసిందిగా జనాలు అభిప్రాయపడుతున్నారు.

Next Story