- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కలప స్వాధీనం
అక్రమ కలప స్వాధీనం చేసుకున్న ఘటన ఉట్నూర్ మండలం వడోని గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, ఉట్నూర్ : అక్రమ కలప స్వాధీనం చేసుకున్న ఘటన ఉట్నూర్ మండలం వడోని గ్రామంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమ కలప ఉందని పక్కా సమాచారం మేరకు ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో తనిఖీలు చేయగా.. 2.5 లక్షల విలువ గల రెండు చెట్ల దుంగలు, పర్నిచర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇటీవల మొండిగుట్టలో అటవీ చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో ఆరు టేకు చెట్ల దుంగలు ఉన్న ఐచర్ వాహనంను పట్టుకుని విచారణ చేపట్టారు. మండలంలోని వడోని గ్రామంలోని పోలీస్ కానిస్టేబుల్ దయానంద్ అని తెలిసిందన్నారు. ఈ విషయమై ఆదిలాబాద్ డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఉట్నూర్ ఎఫ్డీఓ అరవింద్ ల ఆదేశాల మేరకు బుధవారం ఆదిలాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులతో కలసి వడోనీ గ్రామంలోని దయానంద్ ఇంట్లో తనిఖీలు చేశామని, ఈ తనిఖీల్లో 2.5లక్షల విలువ గల రెండు టేకు చెట్ల దుంగలు, పర్నిచర్ కలప స్వాధీనం చేసుకున్నామన్నారు. దయానంద్ కౌలుకు తీసుకున్న భూమిలో ఉన్న కలప చెట్లను నరికి అమ్మేందుకు ప్రయత్నం చేశారని తమ విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సిరిచెల్మ ఎఫ్ఆర్ఓ స్వామి, ఆదిలాబాద్ టాక్స్ పోర్స్ అధికారులు అమర్ సింగ్, కవిత, ఇంద్రవెల్లి ఎఫ్ఎస్ఓ చంద్రరెడ్డి, ఎఫ్బీఓ లు అవినాష్, సత్య, శ్యాం సుందర్, సజన్ లాల్ ఉన్నారు.






