పాత్రికేయుల పేరిట అక్రమ వసూళ్లు

by Sridhar Babu |   ( Updated:2024-09-08 04:32:31.0  )
పాత్రికేయుల పేరిట అక్రమ వసూళ్లు
X

దిశ, మందమర్రి : ఓ న్యూస్ ఛానల్, ఓ దినపత్రికకు సంబంధించిన వ్యక్తిని అంటూ వాట్సాప్ గ్రూపులలో సింగరేణి జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలపై దుష్ప్రచారం చేస్తూ డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు కుందన్ సుఖదేవ్, ఉపాధ్యాయ్, హీరాలాల్, రాజేశం, రాజ్ కుమార్‌లు తెలిపారు. శనివారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు మందమర్రి మండలం అందుగుల పేట శివారులో ఐదు ఎకరాల భూమిని 15 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి అందులో కళాశాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈ భూమిని మా కుటుంబ అవసరాల నిమిత్తం 18 ఏప్రిల్ 2024 రోజున అమ్మకానికి పెట్టి ఒక ఆసామి వద్ద 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నట్లు వివరించారు. తమ అమ్మకపు భూమిలో గిరిజనులకు 38 ఈ పట్టా ఉందని ఓ దినపత్రంలో రాత్రికిరాత్రి ఏడు వార్తా కథనాలు రాసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించారు. ఈ చర్యతో మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న వ్యక్తికి మధ్యవర్తి ద్వారా జూన్ మాసంలో 70 వేల రూపాయలను అందజేసినట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ మరో లక్ష 50 వేల రూపాయలు ఇవ్వాలని టీం సభ్యులు పలుమార్లు మా మొబైల్ ఫోన్ వాట్సాప్ కు ఫోన్లు చేస్తూ తమ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story