జ్యోతి హాస్పిటల్‌లో అక్రమ వసూళ్ల గుట్టు రట్టు

by Taduka Kalyani |

పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ అక్రమ వసూళ్ల బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

జ్యోతి హాస్పిటల్‌లో అక్రమ వసూళ్ల గుట్టు రట్టు
X

దిశ,కాగజ్‌నగర్: పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ అక్రమ వసూళ్ల బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రజా లైఫ్ కేర్ ఆస్పత్రి లో ఒక పాప జన్మించగా.. అత్యవసర చికిత్స కోసం రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రికి కూతవేటు దూరంలో ఉన్న జ్యోతి హాస్పిటల్‌కు పాపను తరలించారు. రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు కేవలం ట్రీట్‌మెంట్ చార్జీల కిందే రూ. 2,200 బిల్లు వేశారు. ఇది కాకుండా మెడికల్ కోసం అదనంగా మరో రూ. 3,000 వసూలు చేశారు. అయితే తాము కట్టిన ఆ మూడు వేల రూపాయలకు మెడికల్ బిల్లు ఇవ్వాలని బాధితులు యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. బిల్లు ఇవ్వడానికి నిరాకరించడంతో, బాధితులు ఆసుపత్రి సిబ్బంది తీరును తమ ఫోన్ లో వీడియో తీశారు. వ్యవహారం ముదురుతుందని భయపడిపోయిన జ్యోతి హాస్పిటల్ యాజమాన్యం. మెడికల్ బిల్లు ఇవ్వకుండానే, తాము వసూలు చేసిన రూ. 3,000 నగదును బాధితులకు తక్షణమే తిరిగి ఇచ్చేసి తప్పు ఒప్పుకుంది. బిల్లు అడిగితేనే మూడు వేల రూపాయలు వెనక్కి ఇచ్చారంటే ఇక్కడ దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగజ్‌నగర్ పట్టణంలో సామాన్యులను పీడిస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story