- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు : సీఐ జి. శ్రావణ్
ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) లను నిర్వహించనున్నట్టు జైనథ్ సీఐ జి. శ్రావణ్ తెలిపారు.

X
దిశ, సాత్నాల : ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) లను నిర్వహించనున్నట్టు జైనథ్ సీఐ జి. శ్రావణ్ తెలిపారు. సాత్నాల మండలం సైద్ పూర్ గ్రామంలో బుధవారం 50 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా గుడుంబా పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. 12 మంది పై బేల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






