- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవు : వైద్యాధికారిణి అనిత
దిశ, మంచిర్యాల: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైధ్యాధికారని డాక్టర్ అనిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడలోని బస్తీ

దిశ, మంచిర్యాల: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైధ్యాధికారిణి డాక్టర్ అనిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడలోని బస్తీ దవఖానాను అకస్మికంగా తనిఖీ చేశారు. దవఖానలో వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజస్టర్ లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బంది సమయ పాలన పాటించి వైద్య సేవలందించాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. వారం లో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి సరైనా మోతాదులో టీకాలు ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. గర్భిణీ స్త్రీల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచనలు చేశారు. వంద శాతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా బాధ్యత తీసుకోవాలన్నారు. తల్లి, బిడ్డల సంక్షేమ కోసం చర్యలు చేపట్టాలన్నారు. సీజెరియన్లు వద్దు సాధారణ ప్రసవాలే ముద్దు అనే నినాదంతో గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలన్నారు. ముఖ్యంగా కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో పొగాకు ఉత్పత్తులు వాటి నుంచి కలిగే అనర్ధాలు యువతకు పిల్లలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు రమ్య, డీపీహెచ్ ఎన్ పద్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






