బస్సులో గుండెపోటు.. ఐసీడీఎస్ ఉద్యోగిని మృతి

by Bhanu |

విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన ఐసీడీఎస్ ఉద్యోగిని గుండె నొప్పితో మృతి చెందిన ఘటన జైనూర్ మండలంలో చోటు చేసుకుంది.

బస్సులో గుండెపోటు.. ఐసీడీఎస్ ఉద్యోగిని మృతి
X

దిశ, ఉట్నూర్: విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కిన ఐసీడీఎస్ ఉద్యోగిని గుండె నొప్పితో మృతి చెందిన ఘటన జైనూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోదరిగూడకి చెందిన దుర్గం సుజాత (45) ఐసీడీఎస్ సూపర్ వైజర్ గా కుంరం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకొని ఇంటికి వచ్చేందుకు జైనూర్ లో ఆర్టీసీ బస్ ఎక్కింది. కొద్ది దూరంలో వెళ్ళక గుండెలో నొప్పిగా ఉందని, సమీప ప్రయాణికులకు తెలపడంతో బస్ ఉట్నూర్ కి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త రమేష్, పిల్లలున్నారు.

Next Story