- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కూతురు చదవడానికే బెదిరించాను తప్ప.. నేను క్రూర మృగాన్ని కాదు
మందమర్రిలో ఆదివారం రోజు జరిగిన తండ్రి, కూతురుల సంఘటన సెన్సేషన్ అయ్యింది. కూతురును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, మందమర్రి : మందమర్రిలో ఆదివారం రోజు జరిగిన తండ్రి, కూతురుల సంఘటన సెన్సేషన్ అయ్యింది. కూతురును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం అవడంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేసింది. వీటి పై వివరణ కోసం మందమర్రి ప్రెస్ క్లబ్‌లో తండ్రి కామెరా ఆనంద్ వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే చదువుకు దూరంగా ఉంటూ అల్లరి చేష్టలు చేస్తున్న తన కూతురు ఉన్నతంగా చదువుకుని, అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆలోచనతో అడవి ప్రాంతంలో పులులు, సింహాలు, జంతువులకు తన కూతురు రియాన్సిక భయపడుతుందన్న విషయాన్ని గుర్తించిన తండ్రి కామెరా ఆనంద్, ఆదివారం మందమర్రిలోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వెనుకల పోచమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న చెట్లలోకి తీసుకెళ్లాడు. ఈ అడవిలో పులులు, సింహాలు, విషసర్పాలు ఉంటాయని, చదువుకోకపోతే ఇక్కడే వదిలేస్తానని బెదిరించానని తప్ప మరే విధంగానూ కాదని ఆయన మందమర్రి ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తన కూతురు చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సదుద్దేశంతో సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వెనుక గల చెట్లను చూపించి అడవి అంటే ఇదేనని, చదువుకోకుంటే ఇక్కడ వదిలేస్తానని బెదిరింపు కోసమే తీసుకువెళ్లానని తెలిపారు.
తన కూతురు బుద్ధిగా చదువుకుంటానని చెప్పడంతో బండిమీద తీసుకువస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి వాట్సాప్‌లోని ఒక గ్రూపులో పోస్ట్ చేయడంతో తనపై అసభ్యకర పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై మందమర్రి ఎస్సై నరేష్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారణ చేపట్టి ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని వదిలేశారని, మంచిర్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు కూడా తనను, తన కూతురు రియాన్సికను గంటసేపు విచారించి తండ్రి సంరక్షణలో క్షేమంగా ఉంటుందని సంతకం తీసుకొని పంపించారని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ద్వారా సమాజంలో తమ కుటుంబం తలెత్తుకోలేకపోతుందని, తాను కనబడితే కొట్టడానికి కూడా జనాలు మీదికి వస్తున్నారని భయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాలను పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే పోస్టులు పెట్టాలని, ఈ తప్పుడు ప్రచారాలతో కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందని వేడుకున్నారు. ప్రభుత్వ అధికారులే విచారణ చేపట్టి ఇందులో ఎలాంటి తప్పు లేదని నిర్ధారించారని ప్రజలందరూ గ్రహించాలని, తన కూతురు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఈ పని చేశానని వెల్లడించారు.






