- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి బంధం చీల్చిన అక్రమ సంబంధం.. మారుతి చేతిలో కీర్తి జీవితం చీకటి కథ
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గురువారం ఒక దారుణ ఘటన జరిగింది. భార్యపై ఆమె భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనం రేపుతోంది.

దిశ, గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గురువారం ఒక దారుణ ఘటన జరిగింది. భార్యపై ఆమె భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇచ్చోడ సీఐ భీమేష్ వివరాలు వెల్లడించారు.గుడిహత్నూర్‌కు చెందిన లట్పటే మారుతి, ముండే సూర్యకాంత్ కుమార్తె కీర్తితో 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం కొన్నాళ్లు వారి సంసారం సజావుగా సాగింది. అయితే మారుతి డైరీ ఫారమ్ నడుపుతూ రూ. 8 లక్షల వరకు అప్పులు చేయడంతో పాటు, స్థానికంగా ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అతన్ని ప్రశ్నించడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
వివాదం పెరిగి కీర్తి పుట్టింటికి వెళ్లిపోవగా, కొద్ది రోజుల క్రితం ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో తన పరువు తీసిందనే ఆగ్రహంతో మారుతి, కీర్తిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.గురువారం ఉదయం కీర్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, కీర్తి ఇంటి పక్కన ఉన్న బోర్‌వెల్ వద్ద నీళ్లు తీసుకుంటుండగా మారుతి ఆమెపై వెనుక నుండి కత్తితో మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కీర్తిని స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సూర్యకాంత్ ముండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ భీమేష్ తెలిపారు.






