అడవులతోనే మానవ మనుగడ : సీనియ‌ర్ సివిల్ జ‌డ్జీ రాధిక

by Ratna Kumari |

దిశ‌, మామ‌డ : అడవులతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అటవీ,

అడవులతోనే మానవ మనుగడ : సీనియ‌ర్ సివిల్ జ‌డ్జీ రాధిక
X

దిశ‌, మామ‌డ : అడవులతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవులు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆశ్రయం, ఆహారానికి మూలాధారాలు లభిస్తాయన్నారు. వీటిని రక్షించే బాధ్యత అందరిపై ఉందని, అటవీ సంపద భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అడవులలోని వన్యప్రాణులకు హాని తల పెడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. నల్దుర్తి గ్రామ సమీపంలోని తురకం చెరువు ఎకో టూరిజం స్థలాన్ని సందర్శించి వివిధ రకాల పక్షులను బైనాక్యులర్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నాగిని భాను, ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు, రామకృష్ణారావు, డిఆర్ఓ నజీర్ ఖాన్, ఎఫ్ ఎస్ ఓ శ్రీనివాస్, అన్నపూర్ణ, జాఫర్, న్యాయవాదులు, FBO లు పాల్గొన్నారు.

Next Story