ఎన్ని కోట్లకు బీఆర్ఎస్ కౌన్సిలర్లను అమ్ముకున్నావ్..?

by Nallavelli.Anjaneyulu |

గెలిచిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎన్ని కోట్లకు కాంగ్రెస్ కు అమ్ముకున్నావో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్నను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూటిగా ప్రశ్నించారు.

ఎన్ని కోట్లకు బీఆర్ఎస్ కౌన్సిలర్లను అమ్ముకున్నావ్..?
X

దిశ, ఆదిలాబాద్ : గెలిచిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎన్ని కోట్లకు కాంగ్రెస్ కు అమ్ముకున్నావో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్నను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎంలకు జోగురామన్న అమ్ముడు పోయి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంతో ఇక నుండి ఆయన జోగురామన్న కాదనీ అలియాస్ జోగు రఫీఉద్దీన్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ గోడం నగేష్, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అనైతిక పొత్తులకు పాల్పడ్డారన్నారు. గతంలో అభివృద్ధి పనుల కోసం తాను, ఎంపీ గోడం నగేష్ ఇద్దరం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని గగ్గోలు పెట్టిన జోగురామన్న ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానమిస్తాలో చెప్పాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ కు ఏయిర్ పోర్టుతో పాటు రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జ్ తో పాటు వందల కోట్ల నిధులు కేంద్రం నుంచి తీసుకురావడం చూసి కళ్ళల్లో కారం కొట్టినట్లు అయిన జోగురామన్న కడుపు మంటతో ఈ కుట్రకు తెరలేపారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు జోగు రామన్న అలియాస్ జోగు రఫీఉద్దీన్ నిజస్వరూపం ఏంటో గుర్తు ఎరగాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ నాయకులు పాల్గొన్నారు.

Next Story