విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

by Ratna Kumari |

దిశ, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మేండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్వాగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీకాంత్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం
X

దిశ, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మేండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్వాగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీకాంత్ ఇళ్లు సోమవారం విద్యుత్ ఘాతంతో పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమ‌వారం మధ్యాహ్నం స‌మ‌యంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు 3తులాల బంగారం కాలిపోయింది. దాదాపు 8లక్షల 98వేల 6వందల రూపాయల నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగే సమయంలో ఇంట్లో ఎవరు లేని కారణంగా ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆ కుటుంబం సర్వం కోల్పోయింది. మానవతా దృక్పథంలో కొద్ది గంటల వ్యవధిలోనే సమాచారం అందుకున్న కేస్లాపూర్ మాజీ సర్పంచ్ మెస్రం నాగనాథ్ మడావి శ్రీకాంత్ కుటుంబానికి నిత్యవసర సరుకులతో పాటు సామాగ్రి దుప్పట్లు అందజేసి, మనోధైర్యం కల్పించారు.

Next Story