- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముధోల్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
by Ratna Kumari |
దిశ, ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లోని మజీద్ చౌక్ సమీపంలో గడ్డమొల్ల రమేష్ అనే వ్యక్తి ఇల్లు ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న కిరాణా

X
దిశ, ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్ లోని మజీద్ చౌక్ సమీపంలో గడ్డమొల్ల రమేష్ అనే వ్యక్తి ఇల్లు ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న కిరాణా షాప్ కు సంబంధించిన సామాగ్రి రెండు లక్షలు, బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలు నాలుగు లక్షలు మొత్తం ఆరు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల వ్యాపించిన మంటలను గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే స్పందించి వ్యాపించకుండా ప్రయత్నం చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంట్లో ఉన్న సిలిండర్ కు మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదంలో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లడంతో ప్రజాప్రతినిధులు- అధికారులు ఆదుకోవాలని బాధితుడు కోరారు.
Next Story






