ముస్లిం సోదరులకు పవిత్ర మాసం "రంజాన్" : మంత్రి గ‌డ్డం వివేక్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-19 15:58:04  IST  )

ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా కానుకలు అందిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార ఘనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు.

ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ :  మంత్రి గ‌డ్డం వివేక్
X

దిశ, మంచిర్యాల : ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా కానుకలు అందిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార ఘనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మసీదులో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు తోఫా కానుకల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ దీపక్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, తోఫా కానుకలు పంపిణీ చేస్తుందన్నారు. జైపూర్ మండలానికి 350, ఇందారం గ్రామానికి 250 తోఫా కానుకలు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు.

Next Story