భారీగా మద్యం పట్టివేత.. మద్యం విలువ రూ. 40వేలు

by Ratna Kumari |

దిశ, మంచిర్యాల : ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 40 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్టు మంచిర్యాల జిల్లా భీమిని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం

భారీగా మద్యం పట్టివేత.. మద్యం విలువ రూ. 40వేలు
X

దిశ, మంచిర్యాల : ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 40 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్టు మంచిర్యాల జిల్లా భీమిని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం భీమిని మండలం నుంచి అక్రమంగా తరలిస్తుండగా.. పట్టుకున్నట్లు ఎస్సై వివరాలు వెల్లడించారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొమ్మురాజు, మానేపల్లి వంశీ టీఎస్ 19 టీ 6601 నెంబర్ గల ఆటోలో భీమిని మండల కేంద్రం నుంచి కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు సాయంత్రం బిట్టూరుపల్లి గ్రామంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం విలువ రూ. 40 వేలు ఉంటుందన్నారు. ఆటో సీజ్ చేసినట్లు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఎన్నికల వేళ మద్యం తరలిస్తే చర్యలు తప్పవు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భీమిని ఎస్సై విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల నిబంధనలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని అన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వాహకులపై నిఘా ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా ఎవరైనా మద్యం తరలిస్తే సమాచారం అందించాలని తెలిపారు.

Next Story