బెజ్జూర్ లో భారీ వ‌ర్షం.. రాక పోక‌ల‌కు అంత‌రాయం

by Ratna Kumari |

దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో సోమవారం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మండలంలో వాగులు పొంగిపొర్లుతుండడంతో

బెజ్జూర్ లో భారీ వ‌ర్షం.. రాక పోక‌ల‌కు అంత‌రాయం
X

దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో సోమవారం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మండలంలో వాగులు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురిసిన భారీ వర్షానికి బెజ్జూరు మండలంలోని కృష్ణ పెళ్లి వాగు, షష్మీర్ వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. బెజ్జూర్ మండలంలోని కృష్ణ పెళ్లి, సుష్మీర్, గొర్రెగూడ, సోమేని, బండలగూడెం, మూగ వెళ్లి, ఇప్పలగూడ, పాత సోమిని, నాయ పెళ్లి, కోయ పెళ్లి, తలాయి, తిక్కపల్లి వంటి గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులకు ప్రజా, ప్రతినిధులకు ఈ వాగులపై వంతెన నిర్మించాలని విన్నవించిన పట్టించుకున్న దాఖలాలు లేవ‌ని ఈ ప్రాంత వాసుల వేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా వాగులపై వంతెన నిర్మించి ఆదుకోవాలని బెజ్జూర్ మండల వాసులు కోరుతున్నారు.

Next Story