మైన‌ర్ బాలిక‌ల‌ను మోసం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : ప‌ట్ట‌ణ సీఐ బ‌న్సీలాల్

by Ratna Kumari |

మైనర్ బాలికలను వేధింపులకు గురి చేసినా.. ప్రేమ పెళ్లిళ్ల పేరుతో వెంటబడి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ బన్సీలాల్ హెచ్చరించారు.

మైన‌ర్ బాలిక‌ల‌ను మోసం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు :   ప‌ట్ట‌ణ సీఐ బ‌న్సీలాల్
X

దిశ‌, చెన్నూర్ : మైనర్ బాలికలను వేధింపులకు గురి చేసినా.. ప్రేమ పెళ్లిళ్ల పేరుతో వెంటబడి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ బన్సీలాల్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కిస్తంపేట గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికను వేధిస్తున్నాడని నేపంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ బన్సీలాల్ కేసు వివరాలను వెల్లడించారు. 15 సంవత్సరాల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంటబడి నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే మైనర్ బాలికను వివాహం చేసుకొని ఆమెను మానసికంగా శారీరకంగా వేధించి ఇంటి నుంచి గెంటవేసిన స్వామి అనే యువకుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఆయన తెలిపారు.

నిందితుడు స్వామి ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి.. ఆ తరువాత అమ్మాయిని ఆమె కుటుంబికుల‌ నిర్ణయానికి వ్యతిరేకంగా వివాహం చేసుకొని ఇంటికి తీసుకువెళ్లిన‌ కొద్ది రోజులకే మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసి ఇంటి నుంచి గెంటి వేశాడు. గత 6 నెలలుగా మరల లైంగిక వేధింపులకు గురి చేయడంతో విసుగు చెందిన మైనర్ బాలిక తన తల్లితండ్రుల సహాయంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన, వివాహం చేసుకుని వేధింపులకు గురి చేసిన స్వామి అనే యువకుడిని మంగళవారం రిమాండ్ కు తరలించామని ఆయన తెలిపారు. మైనర్ బాలికలను ఎవరైనా ప్రేమ పెళ్లి పేరిట వెంట బడిన వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా రౌడీ షీట్ కూడా తెరుస్తామని చెన్నూర్ పట్టణ సీఐ హెచ్చరించారు.

Next Story