నేలకొరిగిన వరి.. తడిసి ముద్దయిన పత్తి, మొక్కజొన్న

by Nallavelli.Anjaneyulu |

దిశ, మామడ : రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటలను కన్నీళ్లతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. అకాల వర్షాలు రైతులకు శాపంగా మారి చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్ద అవుతుండడంతో

నేలకొరిగిన వరి.. తడిసి ముద్దయిన  పత్తి, మొక్కజొన్న
X

దిశ, మామడ : రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటలను కన్నీళ్లతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. అకాల వర్షాలు రైతులకు శాపంగా మారి చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్ద అవుతుండడంతో రైతులు దిగులుగా కూర్చుంటున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో రెండు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న వరి ధాన్యం తడిసిపోయినాయి. చేతికి వచ్చిన వరి పంట ఈదురు గాలుల బీభత్సవంతో నేలకొరగడంతో అన్నదాతలు పడుతున్న అవస్థలు ఆ వరుణ దేవుడికి తెలియాలి. కంటిమీద కునుకు లేకుండా మొక్కజొన్న, పత్తి, సోయా పంటలను కాపాడుకుంటే కష్టార్జితం నీళ్ల పాలవుతున్నాయి. ముఖ్యంగా సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆలోచనలో పడుతున్నారు రైతులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అక్కున చేర్చుకుని తడిసిన పంటలను కొనుగోలు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Next Story