వైభవంగా జగన్నాథుని రథోత్సవం..

by Taduka Kalyani |

ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా జగన్నాథుని రథోత్సవం..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. అలంకరించిన రథంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభించారు. వేదమంత్రాలు, భజనలు, కీర్తనలు, హరినామ సంకీర్తనల మధ్య రథాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో లాగారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్,మున్సిపల్ చైర్మన్ అనూష, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి రథాన్ని లాగి స్వామివారి ఆశీస్సులు పొందారు.దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రథయాత్రలో మహిళలు, యువత, చిన్నారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పూరీ జగన్నాథ రథయాత్రను తలపించేలా జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.

Next Story