కబ్జా కోరల్లో ప్రభుత్వం భూమి..!

by Ratna Kumari |   (  Updated:2025-11-08 16:26:37  IST  )

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా

కబ్జా కోరల్లో ప్రభుత్వం భూమి..!
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. అయినా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు..! అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి రేకుల షేడ్ వేసిన తొలగించే మన రెవెన్యూ అధికారులు..! వాంకిడి మండలంలోని గోయగాంలో సాగుచేసే బీడీపీపీ ప్రభుత్వం భూములో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు ఎకరాలు అక్రమంగా కబ్జా చేసి. దర్జాగా దాబా హోటల్ ను ఏర్పాటు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ. గ్రామ పంచాయతీ అధికారులు మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులతో కుమ్మక్కై వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ భూమి నేషనల్ హైవే రోడ్డుకు అనుకుని ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏజెన్సీ ప్రాంతమైన నేషనల్ హైవే రోడ్డుకు అనుకుని ఉండటంతోఎకరాలకు 50 నుంచి 60 లక్షలపైనే ఉంటుందని స్థానికుల అంచనా వేస్తున్నారు.

అక్రమంగా కబ్జా..

వాంకిడి మండలం గోయగాం గ్రామ పంచాయతీ పరిధిలోని మహాగాం గ్రామానికి చెందిన షేక్ నూర్. షేక్ జమిర్ వారి తాత ముత్తాత నుంచి సర్వే నంబర్ 62/..,107/ లోని 7 ఎకరాలు బీడీపీపీ ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నారు. అయితే 2023లో ఆర్టీఏ చెక్ పోస్ట్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు షేక్ నూర్. షేక్ జమిర్ లనుండి ఎకరం చొప్పున రెండు ఎకరాలు స్వాధీనం చేసుకుని. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. ఇక ఇచ్చిన భూమికి బదులుగా మిగిలిన భూమి పట్టా చేసి చేస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చినట్లు బాధిత రైతు తెలిపారు. ఇదే సమయంలో నేషనల్ హైవే రోడ్డు పనులు నిర్వహించారు. ఇందులో కొంత మేరకు భూమిపోగా.. మిగిలినా రెండు ఎకరాల భూమిని అక్కడి ఓ స్థానిక వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి. ఎలాంటి అనుమతులు లేకుండా దాబా హోటల్ ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఏ చెక్ పోస్ట్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధిత రైతు తన భూమి తనకు తిరిగి ఇవ్వాలని.. లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకొవాలని కోరుతున్నాడు.

ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.

ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం కోసం సదరు రైతు నుంచి రెవెన్యూ అధికారులు భూమి స్వాధీనం చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా..!ఆ స్థలంలో అధికారులు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురైంది. తాజాగా ఆర్టీఏ చెక్ పోస్ట్ ఎత్తివేయడంతో చెక్ పోస్టు నిర్మించే అవకాశం లేకపోవడంతో తమ భూమి తమకు తిరిగి ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ తో పాటు ఆర్డీవో లను కలిసి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం లేదని రైతు వాపోతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ రేపు ముంపు అంటూ కాలం వెల్లదిస్తున్నారని బాధిత రైతు ఆరోపిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న భూమి తిరిగి ఇవ్వాలి : షేక్ అష్ఫక్.

ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం కోసమని మా అన్న. నాన రెండు భూమి ఇచ్చాం. దానికి బదులుగా మాకు పట్టాలు చేసి ఇస్తామన్నారు. కానీ చేసి ఇవ్వలేదు. అలాగే అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ఆ భూమి కబ్జా లో ఉందని. రెవెన్యూ. ఆర్టీఏ అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. తమ భూమి తమకు తిరిగి ఇవ్వాలి. లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకొవాలని రైతు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయమై తహసీల్దార్ కవితను వివరణ కోరగా ఆ భూమిని మేము ఆర్టీఏ అధికారులు అప్పగించామని..రైతు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

Next Story