- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోయా పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి : రైతు సంఘం అధ్యక్షుడు ఇట్టెడి మోహన్ రెడ్డి.
దిశ, బోథ్ : సోయాపంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు ఇట్టెడి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, బోథ్ : సోయాపంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు ఇట్టెడి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బోథ్ గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. రైతు సంఘం అధ్యక్షుడు ఇట్టేడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ డా. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయడం అత్యంత అవసరమని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) హక్కుగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సీజన్‌లో భారీగా నష్టం వాటిల్లిన సోయాబీన్ పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులే దేశానికి వెన్నెముక అని, రైతు సంఘం బలోపేతం ద్వారానే రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని, బోథ్ గ్రామ రైతులతో ఎల్లప్పుడూ కలిసి పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్, అచ్యుతానంద రెడ్డి, రైతులు పాల్గొన్నారు.






