- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి జూపల్లి కృష్ణారావు
దిశ, ఆదిలాబాద్ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.. రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ 2047 లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని పర్యాటక, ఎక్సైజ్ ఉమ్మడి

దిశ, ఆదిలాబాద్ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.. రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ 2047 లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని పర్యాటక, ఎక్సైజ్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుతున్న ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈనెల 4న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్టు తెలిపారు. సీఎం నేతృత్వంలో ప్రజాప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుందన్నజరుపుకుంటుందన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైనట్టు తెలిపారు. దాదాపు రూ.500 కోట్లతో ఇక్కడ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకు స్థాపనలు చేయనున్నట్టు తెలిపారు. పోలీస్ స్ఠాఫ్ క్వార్టర్స్, మహిళల ఆర్థిక ప్రగతి కోసం పెట్రోల్ బంకులు, స్కూల్ బిల్డింగ్స్ లాంటి అభివృద్ధి పనులకు పునాది పడనుందన్నారు. అలాగే మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఈ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులతో మంత్రి ప్రత్యేక సమావేశం
తెలంగాణ ప్రజాప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని మంత్రి జూప్లలి కృష్ణారావు అన్నారు. స్థానిక ప్రజా సేవాభవన్ లో ఆయన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల అభ్యర్దుల గెలుపునకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి,మాజీ ఎంపీ సోయం బాపూరావు,ఆదిలాబాద్,బోథ్, ఆసిఫాబాద్,నిర్మల్ అసెంబ్లీ ఇన్ చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి , ఆడె గజేందర్, శ్యాం నాయక్ , శ్రీహరి రావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, నాయకులు గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






