ప్రభుత్వం వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ కుమార్

by Ratna Kumari |

మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వం వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ కుమార్
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయ‌న‌ పరిశీలించారు. వరి ధాన్యం ఉప్పల వద్ద రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ, వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వరి పంట ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి ఎండల దృష్ట్యా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కు నీడ, త్రాగునీటి సదుపాయాన్ని కల్పించాలన్నారు. రైతులు పండించిన వరి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దంపేట గ్రామ సర్పంచ్ జాడి వెంకటేష్, నాయకులు మొగిలి శ్రీనివాస్, మాధవరపు జీవన్ రావ్, వంశీ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story