- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోడు, సాగు పట్టాలపై ప్రభుత్వం కళ్లు తెరవాలి : రైతు సంఘం అధ్యక్షుడు దుర్గం రాజేష్
దిశ, మంచిర్యాల : పోడు భూములు సాగు చేసే రైతులకు పట్టాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్)

దిశ, మంచిర్యాల : పోడు భూములు సాగు చేసే రైతులకు పట్టాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మండల కమిటీ అధ్యక్షుడు దుర్గం రాజేష్ అన్నారు. మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం అక్కలపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద రైతులు గత 50 సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పోడు రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరా లేదన్నారు.కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి పోడు రైతులకు పట్టాల పరిష్కారం చూపాలన్నారు. పోడు భూములు సాగు చేసే రైతన్నలకు ప్రభుత్వం పట్టాలిస్తామని చెప్పినా ఇప్పటివరకు పోడు సమస్యపై పట్టించుకోలేదన్నారు.
పోడు భూములు సాగు చేసే రైతులకు పట్టా పాసు పుస్తకాలు కల్పించకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. పంటలు సాగు చేసేందుకు షావుకారుల వద్ద మధ్య దళారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. ప్రభుత్వం పోడు రైతుల కు పట్టా పాసు పుస్తకాలు ఇప్పిస్తే బ్యాంకుల్లో పంట రుణాలు పొందేందుకు వీలు ఉంటుందన్నారు. అప్పులు తెచ్చి పంట చేసిన రైతులకు అకాల వర్షాల వలన పంటలు దెబ్బ తినడంతో రైతన్నలు దిక్కు తోచని పరిస్థితిలో దీనస్థితిలో ఉన్నారని అన్నారు. చివరికి పంట దిగుబడి రాక ఉన్న పంటను అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పోడు భూముల పట్టాల విషయంపై కార్యాచరణ రూపొందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పోడు రైతుల దండుతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ చప్పిడి. అన్నారావు,దుర్గం. ఇస్తారీ, జుమ్మిడి. శ్యాం, చిన్నయ్య, జాడి. పోచయ్య, పెంటయ్య, సువాస్, బుద్దుల్, నజీర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.






