- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం పరితపించే కాన్వోకేషన్ డే వేడుకలు ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నారని మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ తెలిపారు.

దిశ, మందమర్రి : ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం పరితపించే కాన్వోకేషన్ డే వేడుకలు ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నారని మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని, పై తరగతులకు వెళ్లుతున్న విద్యార్థులకు కాన్వోకేషన్ డే వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ హాజరై, ఐదో తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కృషి వల్ల నేడు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా నాణ్యమైన మెరుగైన విద్యను పిల్లలకు అందించడంలో ముందంజలో ఉందని కొనియాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని ఉపాధ్యాయులు అహర్నిశలు చేస్తున్న కృషికి తల్లిదండ్రులు సహకరిస్తున్న విధానంతో మండలంలోనే ఉన్నతమైన పాఠశాలగా ఈ పాఠశాల నిలిచిందన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, విద్యార్థులు అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాయని తెలిపారు. వినూత్న రీతిలో విద్యాబోధన చేస్తూ, శాస్త్రీయ పద్ధతులలో, ప్రత్యక్ష బోధన పద్ధతులతో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నాయన్నారు. మండలంలోని అత్యధిక విద్యార్థులు ఫిల్టర్ బెడ్ ఎంపిపిఎస్ పాఠశాలలో చేరి, విద్యను అభ్యసిస్తున్నారని, ఈ పాఠశాల ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరుకాగా, ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల రూపకంగా విద్యార్థులు చేసిన నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య శ్రీనివాస చారి, ఉపాధ్యాయులు జనగామ ఉమాదేవి, భీం పుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి,మంజుల, అమ్మ ఆదర్శం పాఠశాల చైర్మన్ దూలం అంజలి, బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చారి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






