ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని 268 చెక్కులను లబ్దిదారులకు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాల లబ్ది పొందడంలో అర్హులైన వారు మధ్య దళారులను నమ్మే అవసరం లేదన్నారు. ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా అంతిమంగా ప్రజా సంక్షేమం కోసం పని చేయడమే లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యులై వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆర్డీవో స్రవంతి నాయకులు బంతిపెల్లి దయాకర్, సంతోష్ పాల్గొన్నారు.

Next Story