- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పిన ప్రమాదం.. ఇంజన్ నుండి విడిపోయిన గూడ్స్ రైలు బోగిలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం గూడ్స్ రైలు వెళ్తుండగానే వెనుక బోగీలు విడిపోయాయి.

X
దిశ, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం గూడ్స్ రైలు వెళ్తుండగానే వెనుక బోగీలు విడిపోయాయి. బళ్ళార్షా వైపు నుంచి కాజీపేట వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీల మధ్యలో ఉండే కప్లింగ్ పిన్ (లింక్) ఊడిపోవడంతో 8 బోగీలు ఇంజన్ నుండి విడిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే రేచిని రోడ్ రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇంజన్‌కు ఉన్న బోగీలను రైల్వే స్టేషన్‌కి తరలించారు. రైలు ఇంజన్‌ను విడిపోయిన బోగీల వద్దకు తీసుకు వచ్చి మరమ్మతులు (లింక్) చేసి గూడ్స్ రైలును స్టేషన్ కు తీసుకొని వెళ్లారు.
Next Story






