నిరుద్యోగులకు సువర్ణ అవకాశం....

by Kodari Anjali |   (  Updated:2026-04-13 14:38:58  IST  )

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం అవకాశం కల్పించింది.

నిరుద్యోగులకు సువర్ణ అవకాశం....
X

దిశ, సాత్నాల: జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే సాత్నాల మండలంలో రెండు మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉండగా.. స్థానిక మండల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జాదవ్ రామారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని కాన్ప మేడిగూడ, సైద్‌‌పూర్ గ్రామాల్లో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని.. కావున మండలానికి చెందిన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Next Story