భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణ ను ప్రారంభించిన జీఎం

by Nallavelli.Anjaneyulu |

రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నభారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ప్రథమ చికిత్స, హైక్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణ ను ప్రారంభించిన జీఎం
X

దిశ, రెబ్బెన: రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నభారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ప్రథమ చికిత్స, హైక్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజ‌రై స్కౌట్ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవా అత్యవసర పరిస్థితుల్లో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ సేవలు గొప్పవని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు, స్వయం కృషితో ఎదగడం, శారీరక, మానసికంగా ధృడత్వం భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ద్వారా పెంపొందుతాయన్నారు. ప్రథమ చికిత్స చేయడం ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని సూచించారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు యునిఫామ్స్ పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు జరిగినప్పుడు అధించే సహాయం, ప్రథమ చికిత్స, కొత్త ప్రదేశాల్లో చాకచక్యంగా ప్రయాణించడం వంటి సేవా కార్యక్రమాలపై మూడు రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటియూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, డీజీఎం సివిల్ SK మదీనా భాషా, సీనియర్ పీఓడీ ప్రశాంత్ ,ప్రధానోపాధ్యాయుడు ఎం రవితేజ, వ్యాయమ ఉపాధ్యాయుడు బాస్కర్, అన్ని ఏరియా ల సింగరేణి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story