- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్కే వన్-ఏ గనిని సందర్శించిన జీఎం మోహన్ రెడ్డి
కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ రామకృష్ణాపూర్ ఆర్కే వన్-ఏ భూగర్భ గనిని శనివారం ఏరియా జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి సందర్శించారు.

దిశ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ రామకృష్ణాపూర్ ఆర్కే వన్-ఏ భూగర్భ గనిని శనివారం ఏరియా జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పని కొనసాగుతున్న ప్రాంతాల్లో గాలి, వెలుతురుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను తదితర విషయాలను గని మేనేజర్ ను అడిగి పలు సూచనలు అందజేశారు. అనంతరం ఆయనకు గని మేనేజర్ శ్రీధర్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని పేర్కొన్నారు. కార్మికుల సౌకర్యాలు, సంక్షేమానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.కే గ్రూప్ ఏజెంట్ రాందాస్, ఇంజనీర్ ఏజీఎం నాగరాజు, రక్షణ అధికారి జయంత్, సంక్షేమ అధికారి శ్రీనివాస్, పిట్ సెక్రెటరీలు వినయ్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.






