- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
దిశ ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో ఉత్తర వాహిణిగా ప్రవహించు గోదావరి నది తీరమున వెలిసిన భక్తుల ఆరాధ్య దైవం అయిన ఏకశిలా కొండల్లో

దిశ ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో ఉత్తర వాహిణిగా ప్రవహించు గోదావరి నది తీరమున వెలిసిన భక్తుల ఆరాధ్య దైవం అయిన ఏకశిలా కొండల్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు చక్రపాణి నరసింహా మూర్తి, కోటపల్లి అనిష్, కోటపల్లి నితీష్ ఆధ్వరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. . స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలకు విచేస్తున్న ఉమ్మడి జిల్లా మంచిర్యాల్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, నిజామాబాద్, జిల్లాల నుంచి కాకుండా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చినభక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ రాంనాయక్, ప్రధాన కార్యదర్శి బక్కి కృష్ణ, క్యాషియర్ గాజుల శ్రీనివాస్,మాజీ జడ్పీటీసీ ఆకుల రాజమణి వెంకగౌడ్,ఎంపీటీసీ జంగిలి సరితా శంకర్ లు జాతర మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి యేటా నవరాత్రులు పురస్కరించుకొని నవరాత్రులు అయిన మూడు రోజులకు శ్రీనివాస కళ్యాణం, నవరాత్రుల పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవ చక్రపాణి నరసింహా మూర్తి . బ్రహ్మోత్సవ జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవంలా భాగంగా శనివారం రాత్రి ఆలయ ఆవరణలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవంలా కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు . ఈ వేడుకలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు.






