- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసియా కప్ విజేతగా సుహాసిని ప్రతిభ చాటింది : జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
సిర్పూర్ యు మండలానికి చెందిన గేడం సుహాసిని, ఆసియా కప్ పోటీలో బంగారు పతకం సాధించి జిల్లాకు గొప్ప గౌరవం తీసుకువచ్చిందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : సిర్పూర్ యు మండలానికి చెందిన గేడం సుహాసిని, ఆసియా కప్ పోటీలో బంగారు పతకం సాధించి జిల్లాకు గొప్ప గౌరవం తీసుకువచ్చిందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం ఆమెను జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందిస్తూ, శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఆసియా కప్ పోటీల్లో వివిధ దేశాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీ పడి, గిరిజన విద్యార్థినిగా సుహాసిని బంగారు పతకం గెలవడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఆమె సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని అభిప్రాయపడ్డారు.
సుహాసినిలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ వల్లే ఈ స్థాయికి చేరిందని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. తద్వారా గిరిజన బాలికలకూ ఆటలలో అవకాశాలు విస్తరిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.






