- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాగజ్‌నగర్ వెల్కమ్ హోటల్‌లో గ్యాస్ పేలుడు
కాగజ్ నగర్ పట్టణంలోని వెల్కమ్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

X
దిశ, కాగజ్‌నగర్ : కాగజ్ నగర్ పట్టణంలోని వెల్కమ్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 5:30 గంటల సమయంలో వంట చేస్తున్న క్రమంలో కమర్షియల్ సిలిండర్ గ్యాస్ పైపు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి రోజువారి కూలీలు మల్లయ్య, మొబీన్, సుభాష్, గౌస్, సురేష్. గాయపడ్డారు వారిని వెంటనే విజయ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపాల్ సందర్శించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






