- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉండాలి : గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షుడు సురేష్
దిశ, ఖానాపూర్ : వృత్తిలో పని చేస్తున్న గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉండాలి గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షుడు పరిమి సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ

దిశ, ఖానాపూర్ : వృత్తిలో పని చేస్తున్న గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉండాలి గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షుడు పరిమి సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సంబరాలు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భీష్ముని చిత్రపటానికి పూలమాలలతో పూజించి, గంగపుత్రుల నీలిరంగు జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షుడు పరిమి సురేష్ మాట్లాడుతూ ప్రపంచ మత్యకారుల దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమన్నారు. మత్స్యకారులు రాత్రులు, పగలు అనకుండా చెరువులో, నదులలో చేపల వేటకు వెళ్తునట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వృత్తి ఎంతో ప్రమాదకరమని.. ఇలాంటి వృత్తి లో గంగపుత్రల సంఘ సభ్యులు పని చేస్తున్నారు అని ఆయన అన్నారు. గంగపుత్రులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు పరిమి రమేష్, డైరెక్టర్లు మైలారపు గంగాధర్, మింగు భీమన్న,గడ్డమీది రవి, పరిమి చంద్ర విలాస్, ఉషల్వార్ లాలు, కాశ వేణి లక్ష్మణ్, గద్దమీది నర్సయ్య, మైలారపు బీమ్ రావు, కాశ వేణి గణేష్, పరిమి నరసయ్య, రమేష్, నరేష్ పాల్గొన్నారు.






