"మామ" కడచూపు కోసం..!

by Batti.Sumithra |

నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి అంతిమయాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు.

మామ కడచూపు కోసం..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుపొంది... చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో "మామ"అని పిలిపించుకున్న నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి అంతిమయాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు. ఆయన స్వగ్రామం మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆయన కూడా మామ అని సంబోధించేవారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగతా రోజుల్లో జనం - మనం అంతా ఒక్కటే అంటూ చివరిదాకా ఆయన అందరి తలలో నాలుకలా మెదిలారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని అంత్యక్రియలకు హాజరైన ప్రతి ఒక్కరూ నెమరు వేసుకున్నారు.

అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీహరి రావు ఆయన పాడె మోశారు. అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు పైడిపల్లి రవీందర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీమ్ రెడ్డి, ఆనంద్ రావు పటేల్, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హరీష్ కుమార్, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తోట సత్యం, ఎంబడి రాజేశ్వర్, రామేశ్వర్ రెడ్డిమహిపాల్ రెడ్డి, డాక్టర్ సుభాష్ రావు, భూపాల్ రెడ్డి, మహమ్మద్ రఫీ, రోడ్డ మారుతి, బొల్లోజి నరసయ్య, చంద్రశేఖర్ గౌడ్, వినాయక్ రెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Next Story