- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
by Ratna Kumari |
దిశ, బెజ్జూర్ : రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైన సంఘటన బెజ్జూర్ మండలం కృష్ణపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బెజ్జూర్ మండలం

X
దిశ, బెజ్జూర్ : రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైన సంఘటన బెజ్జూర్ మండలం కృష్ణపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బెజ్జూర్ మండలం ఇందిర గ్రామానికి చెందిన సెండ్ లక్ష్మణ్, లక్ష్మీ, నీకాడ నిర్మల ఆదివారం బెజ్జూర్ వైపు వస్తుండగా.. కృష్ణపల్లి గ్రామానికి చెందిన కొడప విజయ్, నాగుల్వాయి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. రెండు ద్విచక్ర వాహనాల డ్రైవర్లు కడప విజయ్, లక్ష్మణ్ ల పరిస్తితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరిని కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కి తరలించారు. క్షతగాత్రులను ఎస్సై సర్దాజ్ పాష సందర్శించి వివరాలను సేకరించారు.
Next Story






