- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, బెల్లంపల్లి :మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మెయిన్ బజార్ ఏరియాలో పార్కింగ్ చేసి ఉన్న కారులోంచి రూ.28 లక్షల చోరీ కేసును పోలీసులు చేధించారు. కేసు వివరాలను పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 17న ఉదయం 10:30 లకు బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ పక్కన గల సత్తన్న ఇడ్లి బండికి చేరువలో నిలిపి ఉంచిన కారు నుండి రూ.28 లక్షల బ్యాగ్ ని ఇద్దరు వ్యక్తులు దొంగలించారు. బెల్లంపల్లి 1 టౌన్ ఇన్ స్పెక్టర్ దేవయ్య అధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. హైదరాబాదులోని అత్తాపూర్ కేరాఫ్ భరత్ నగర్ కు చెందిన పటాలవత్ దాసు, జోగు @ పోతలుశివ, రంగారెడ్డి కి చెందిన ముప్పూరు రాజు, బెల్లంపల్లి కన్నాలబస్తికి చెందిన పండుగ రాజు భారిచోరీ కేసులో ఉన్నారు. పట్లవాత్ దాసు అనే వ్యక్తి గతంలో ఫిర్యాది అయిన బిపిన్ కుమార్ అనే వ్యాపారి వద్ద కార్ డ్రైవర్ గా పని చేశాడు. పని మానేసిన తర్వాత.. తన స్నేహితులైన జోగు @ పోటలు శివ, ముప్పురు శివ పండుగ రాజుల తో కలిసి బ్యాగును దొంగలించుకెళ్ళారు. పాత బెల్లంపల్లి శివార్లలో గల అడవిలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం టిఫిన్ చేయడానికి బెల్లంపల్లికి వస్తున్నారు. బెల్లంపల్లి బస్తి ప్రభుత్వ కళాశాల మూల వద్ద వాహనాల తనిఖి చేస్తుండగా డబ్బు బ్యాగులతో బైక్ లపై వస్తూ పట్టుబడ్డారు.
- Tags
- crimes
Next Story






