నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. నలుగురు నిందితుల అరెస్ట్

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి శివారులో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..  నలుగురు నిందితుల అరెస్ట్
X

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి శివారులో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, రూ.60 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు జిట్టావార్ కిషోర్ రెడ్డి, రక్తావర్ పవన్, నవగరే కునాల్, కుల్దీప్ టాక్రేలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గుజరాత్‌కు చెందిన కంపెనీ పేరుతో నకిలీ విత్తనాలను అసలైనవిగా చూపించి రైతులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. రైతులు జాగ్రత్తలు వహించి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.

Next Story