- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటాం : మాజీ మంత్రి జోగు రామన్న
సోయా కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు.

దిశ, ఆదిలాబాద్ : సోయా కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ బంద్ కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని కోరారు. సోయాబీన్ కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మానసిక స్థితితో ఆటలాడుకుంటున్నాయన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు ధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. రైతులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలతో ముందుకు పోతామన్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ 6వ తేదీన తలపెట్టే ఆదిలాబాద్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, స్వచ్ఛంద సంస్థలు, ఆర్టీసీ, చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరూ రైతులకు అండగా స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెట్టు ప్రహ్లాద్, సాజీదొద్దీన్, గండ్రత్ రమేష్, అశోక్ స్వామి, యూనిస్ అక్బానీ, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.






