ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతి

by Ratna Kumari |

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అజ్మీర గోవింద నాయక్ తన స్వగృహం అయిన దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో కొద్దిసేపటి క్రితం అనారోగ్యం తో ఆయన తుది శ్వాస విడిచారు.

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతి
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అజ్మీర గోవింద నాయక్ తన స్వగృహం అయిన దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో కొద్దిసేపటి క్రితం అనారోగ్యం తో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1985సంవత్స కాలంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1985 లో ఇండిపెండెంట్ గా ఖానాపూర్ శాసనసభ్యులుగా గెలిచి 1989 వరకు ఎమ్మెల్యే గా కొనసాగారు. టిడిపి పార్టీ నుండి 1994 నుండి 99 వరకు, టిఆర్ఎస్ పార్టీ నుంచి 2004 నుండి 2008 వరకు మూడు దశాబ్దాలు ఖానాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన ఆయన ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగానే కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి జాన్సన్ నాయక్, ఖానాపూర్ నియోజకవర్గ పలు పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Next Story