- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలికకు బలవంతపు పెళ్ళి..!
దిశ, ఆదిలాబాద్ : మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆదిలాబాద్ జిల్లా మావలా పోలీస్ స్టేషన్

దిశ, ఆదిలాబాద్ : మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆదిలాబాద్ జిల్లా మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలనీకి చెందిన బాలిక(17) కి ఆదివారం తల్లిదండ్రులు బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. ఆ బాలిక చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి ఫోన్ చేసింది. దీంతో వారు వెంటనే స్పందించారు. చైల్డ్ లైన్ సూపర్ వైజర్ అనిల్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కె.వినోద్, షీ టీం కానిస్టేబుల్ మహేష్ తో పాటు మావల పోలీస్ కానిస్టేబుల్ లతో కలిసి బాలిక సూచించిన ఇంటికి వెళ్లారు. బాల్య వివాహంతో అనర్ధాలు సంభవిస్తాయని తల్లితండ్రులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు తల్లిదండ్రులు అతని బాలిక మేజర్ అయిన తర్వాతనే ఆమెకి ఇష్టమైన అబ్బాయితో పెళ్లి జరిపిస్తామని రాసి ఒప్పంద పత్రం రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఆ బాలికను సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టి బాలికను బాల సదనానికి తాత్కాలికంగా వసతి కల్పించి సంరక్షిస్తున్నారు.






